25, డిసెంబర్ 2010, శనివారం
ఆకట్టుకున్న 'లేపాక్షి' ప్రదర్శన
విశాఖపట్నం: సుమారు పది రాష్ట్రాలకు చెందిన వివిధ ఉత్పత్తులు ఒకే వేదికపై కొలువు తీరి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ కొత్త రైతుబజారులో ఏర్పాటుచేసిన ప్రదర్శన శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ బి.ప్రభాకర శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని దీనిని ప్రారంభించారు. ఇంటికి శోభనిచ్చే గృహాలంకరణ వస్తువులు, మహిళలు దుస్తులు, చిన్నారులు మెచ్చే బొమ్మలు.... ఇలా అన్నీ అందుబాటులో ఉంచారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, హైదరాబాద్ బంజారా చేతి ఎంబ్రాయిడరీ, కళంకారి, గుంటూరు మంగళగిరి ఫ్యాబ్రిక్, వెంకటగిరి చీరలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహాన్‌పూర్ వుడ్ కార్వింగ్స్, బెనారస్ చీరలు, కర్నాటక రోజ్ వుడ్ కార్వింగ్స్, అగర్‌బత్తీలు, మద్యప్రదేశ్ మహేశ్వరి చీరలు, బెల్‌మెటల్ ఉత్పత్తులు, పశ్చిమ బెంగాల్ చీరలు, నార సంచులు, తంజావూర్ పెయింటింగ్స్, రాజస్థాన్ జువెలరీ, హర్యానా బెడ్‌షీట్స్, గుజరాత్ దుస్తులు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. జనవరి 2వ తేదీ వరకు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని లేపాక్షి సీనియర్ మేనేజర్ జగన్మోహనరావు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి