ఢిల్లీ: నాణ్యత తక్కువ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీసీఐకి ఆదేశాలు ఇచ్చామని కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధిమారన్ తెలిపారు. ఆయనతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పత్తి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దయానిధి మాట్లాడుతూ పత్తి, జనుము కొనుగోళ్ల విషయంలో అన్ని చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తొందరపడి తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దని సూచించారు. తగిన ధరతో జనుమును కూడా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రేపట్నుంచే సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని తెలిపారు.దుకు టీడీపీ ఎంపీలు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టే విషయంపై చర్చలు జరిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి