* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

31, డిసెంబర్ 2010, శుక్రవారం

ఒక్కో వార్డు అభివృద్ధికి రూ.1.5 కోట్లు

 మేయర్‌ జనార్దనరావు
విశాఖపట్నం(విశాల విశాఖ )  కొత్త ఏడాది ఒక్కో వార్డులో అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్లు మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్‌ పి.జనార్దనరావు తెలిపారు. శుక్రవారం ఉప మేయర్‌ కె.దొరబాబు, కమిషనర్‌ వీఎన్‌ విష్ణు, ఫ్లోరులీడర్‌ బెహరా భాస్కరరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ప్రతి వార్డులో రూ.50 లక్షలతో పనులు చేపట్టామన్నారు. అధిక ప్రతిపాదనలు రావడంతో రానున్న సంవత్సరంలో కేటాయింపులు పెంచుతున్నామని చెప్పారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం అమల్లో ఉన్న 65 మిషన్‌ సిటీల్లో జీవీఎంసీ ఉత్తమ నగరం అవార్డుతోపాటు రూ.4.50 లక్షల ప్రోత్సాహకం అందుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ.1,886 కోట్లతో చేపట్టిన 20 ప్రాజెక్టుల్లో ఇప్పటికే మూడు పూర్తి చేశామన్నారు. మెరుగైన మంచినీటి సరఫరా, బీఆర్‌టీఎస్‌ కారిడార్లు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న 15,320 ఇళ్ల కోసం ఇప్పటికే 9,626 మంది లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. మురికివాడల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌, ఎర్రగెడ్డ కెనాల్‌ ఆధునికీకరణ స్ఫూర్తితో మిగిలిన చోట్ల గెడ్డల పనులు నిర్వహిస్తామన్నారు. రూ.20 కోట్ల సాధారణ నిధులతో రహదారులు, పాఠశాలలు, సామాజిక భవనాలు, సులభ్‌ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టామని వివరించారు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) కింద 18,125 దరఖాస్తులు పరిష్కరించి రూ.83.46 కోట్ల ఆదాయాన్ని సేకరించామన్నారు.ఆస్తి పన్ను పెంపుతో జీవీఎంసీ ఆదాయం రూ.137.54 కోట్లకు పెరిగిందని మేయర్‌ వివరించారు. పెంచిన పన్నుపై ప్రజల నుంచి వచ్చిన 54 వేల పునః పరిశీలన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 13 వేలు పరిష్కారమైనట్లు తెలిపారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.75 కోట్ల బ్యాంకు లింకేజీతో మహిళా సంఘాలకు రుణ సాయం అందించామన్నారు. సూక్ష్మ రుణ సంస్థల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా రూ.60 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేందుకు జీవీఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి జోన్‌లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని వివరించారు. స్వీకారం, బాల్యం విద్యాశ్రీ పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కమిషనర్‌ వీఎన్‌ విష్ణు మాట్లాడుతూ జీవీఎంసీ 2010లో అనేక విజయాలు సాధించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2011లో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉప మేయర్‌ కె.దొరబాబు మాట్లాడుతూ కొత్త ఏడాదిలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఫ్లోరు లీడర్‌ బెహరా భాస్కరరావు కూడా మాట్లాడారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి