జమ్మూ: పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. భారత సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడింది. సాంబ జిల్లాలోని భారత సరిహద్దులోని ఓ ఔట్‌పోస్ట్‌పై పాక్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. రాకెట్ ప్రొజెక్త్టెల్ గ్రెనేడ్స్‌తో పాక్ దళాలు భారత సరిహద్దులపై విరుచుకుపడ్డాయని బీఎస్‌ఎఫ్ డీఐజీ జి. ఓబరాయ్ తెలిపారు. అప్రమత్తమైన భారత దళాలు ఎదురు కాల్పులు జరిపాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులకు పాల్పడడం ఈ నెలలోనే ఇది మూడోసారి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి