21, డిసెంబర్ 2010, మంగళవారం
ఆరో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష
హైదరాబాద్: రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. ఆరో రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగానీరసించిపోయారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని... ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. తక్షణం నరం ద్వారా సెలైన్, ద్రవాహారం ఎక్కించాలని, కనీసం ఏదైనా తాగడం చేయాలని వైద్యులు చంద్రబాబును బలవంతపెట్టారు. ఇందుకు చంద్రబాబు గట్టిగా నిరాకరించారు. మంగళవారం చంద్రబాబుతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నేడు తెదేపా అన్ని జిల్లా కలెక్టరేట్ల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి