తాండూరు(విశాల విశాఖ): పదేళ్ల తరువాత చలి విజృంభిస్తుంది.ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నడూ లేనివిధంగా 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.గత వారం రోజుల నుండి మధ్యాహ్నం మూడు గంటలకే చలి ప్రారంభమై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు.రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఉదయం 7 గంటల వరకు పొగమంచు వీడటం లేదు.చలి పెరగడంతో ఉదయం 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడంలేదు.తిరిగి సాయంత్రం 5 గంటలకే ఇంటి ముఖం పడుతున్నారు.ప్రస్తుతం ఉన్న 8 డిగ్రీల ఉష్ణోగ్రత కనీసం పది సంవత్సరాల తరువాత వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 10 నుండి 11 వరకు నమోదు అయితేనే చలి విపరీతంగా ఉంటుంది.అలాంటిది ఒక్కసారిగా 8 డిగ్రీలకు పడిపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఇటీవల కురిసిన వర్షాలు,తుఫాను ప్రభావం వల్లనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.దీంతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కంది పంటపెై ప్రభావం ఉంటుందని రెైతులు ఆందోళన చెందుతున్నారు.ప్రతి రోజు ఉదయం కురుస్తున్న పొగ మంచువల్ల కంది పూత రాలిపోవడంవల్ల కాయ ఏపుగా పెరగదని రెైతులు పేర్కొంటున్నారు.చలి ధాటికి సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు.ఉష్ణోగ్రతలు పెరిగితే కాని చలి తీవ్రత తగ్గదని అధికారులు పేర్కొంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి