రోబో హీరో రజినీకాంత్ అరవై పదుల్లోకి అడుగుపెట్టారు. వయస్సు పెరిగినా వన్నె తరగని కథానాయకుడిగా రాణిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.అభిమానం పాళ్ళు కాస్త ఎక్కువైన తమిళ తంబీలు రజినీకాంత్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అభిమాన సంఘాలతో పాటు ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేస్తూ రజనీ పుట్టిన రోజున కేక్‌లు కట్ చేస్తూ పండుగలా జరుపుకుంటున్నారు.తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రల నుంచి సూపర్‌స్టార్‌గా ప్రకాశిస్తున్న రజినీకాంత్ అభిమానులకు ఆరాధ్యదైవం. అంతేకాదు.. రజినీకాంత్ భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత సాధించాడు. అలాగే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని తన రికార్డులు తానే అధిగమించిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో (18.08.1975లో విడుదలైన) తెరకెక్కిన ఆపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన రజినీకాంత్ 158 చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన రజినీకాంత్ 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 60వ ఏట రోబోతో హిట్ కొట్టిన యాంత్రికుడికి మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే టు రజినీకాంత్....!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి