ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిలు, 30 ఏళ్ల లోపు యువతుల ఎద ఆకృతులలో భారీగా తేడాలు వచ్చినట్లు బ్రా కంపెనీలు చెపుతున్నాయి. సహజంగా స్త్రీలు వాడే "బి" బ్రా సైజుకు బదులు ఇప్పుడు డిడి సైజులు ఎక్కువగా వాడుతున్నట్లు చెపుతున్నాయి. ఇది గత 20 ఏళ్ల కాలంలో చోటుచేసుకున్న పరిణామంగా వారు అభివర్ణిస్తున్నారు.దీనికి కారణాలేమిటో వారు చెప్పలేకపోయినా... ఆరోగ్య నిపుణులు మాత్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అసలు విషయాన్ని కనుగొన్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు, ఆహారపుటలవాట్ల మూలంగా స్త్రీలలో హార్మోన్లకు సంబంధించి గణనీయమైన తేడాలు చోటుచేసుకున్నట్లు తమ పరిశోధనలో తేలిందంటున్నారు. ఫలితంగా వారు ధరిస్తున్న బ్రాలతో పాటు లింగరీ సైజుల్లో కూడా తేడాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నట్లు వెల్లడించారు.బ్రాలను తయారు చేసే ఓ ప్రముఖ కంపెనీ మాట్లాడుతూ... టీనేజర్స్, స్లిమ్‌గా ఉన్న మహిళల్లో ఎద సైజులు అనతి కాలంలో భారీగా పెరిగి పోవడాన్ని తమ కంపెనీ బ్రాలు పట్టి చూపిస్తున్నాయంటోంది. తొలుత "బి" సైజు బ్రాలను వాడే యువతులు రెండు మూడు సంవత్సారాల కాలంలోనే ఏకంగా ఎఫ్ సైజు నుంచి జి సైజు కప్ లున్న బ్రాలను కొనుగోలు చేస్తున్నారని చెపుతోంది.బక్కపలచగా ఉన్న అమ్మాయిల్లో చాలామంది 10ఎఫ్ బ్రా సైజును వాడుతున్నారంటే వారి ఎద సంపద ఏమేరకు వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చని సోదాహరణంగా వివరించింది. ఇదిలావుండగా చాలామంది టీనేజ్ ఆడపిల్లలు తమకు ఆకర్షణీయమైన ఎద సంపద లేకపోతే అల్లాడిపోయే మనస్తత్వం కలిగి ఉండటాన్ని తాము గమనించామని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎలాగైనా వక్ష సంపదను పెంచుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పలు మార్గాలను అవలంభించడం కూడా ఇందుకు కారణమవుతోందంటున్నారు.ఇక లింగరీల విషయంలోనూ ఇదే వ్యవహారం జరుగుతోందంటున్నారు. ఇటీవల కాలంలో అమ్మాయిలు ముఖ్యంగా తమ ఎద సైజులతోపాటు పిరుదుల సైజులను పెంచుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనీ, అందుకోసం ప్రత్యేకమైన వ్యాయామాలను సైతం ఆచరిస్తున్నారని వెల్లడించారు. దీంతో బ్రా, లింగరీ సైజుల్లో భారీ తేడాలు చోటుచేసుకుంటున్నాయని చెపుతున్నారు.అయితే పెరిగిపోతున్న వక్షోజ ఆకృతులకు ఆహారటపులవాట్లకు సంబంధమున్నదని అంటున్నారు. కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం ఒక కారణమయితే, శరీరానికి పని చెప్పకుండా ఉండటం మరో కారణమంటున్నారు. వీటి ఫలితంగా టీనేజ్ వయసుకు చేరుకునే పిల్లల్లో వయసుకు మించిన శరీరపు సంపద వచ్చి చేరుతోందని అంటున్నారు. అందువల్లనే ఇటువంటి తారతమ్యాలు కనబడుతున్నాయంటున్నారు.కనుక పిల్లలకు మోతాదుకు మించిన కొవ్వు పదార్థాలను ఇవ్వకుండా ఉండటమే కాక మితిమీరిన ఫ్యాషన్ ప్రపంచపు పోకడలకు బానిసలవకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి