కేసిఆర్ ఆశ
తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరిలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలిపోవచ్చని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2జీ స్పెక్ట్రమ్ ఉచ్చులో పూర్తిగా ఇరుక్కుపోయిందని, ఇటు సీమాంధ్రలో జగన్‌కు 70 మంది ఎమ్మేల్యేల మద్దతు ఉందని ఒకవేళ ఎన్నికలే జరిగితే కాంగ్రెస్‌కు ముందున్నది గడ్డుకాలమేనని ఆయన అన్నారు.మధ్యంతర ఎన్నికలు జరిగితే తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రశేఖర్‌రావు అన్నారు. అయితే జగన్‌తో కలిశామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.తెలంగాణా అంశంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో తమ కార్యకర్తలు సహనం కోల్పోయి రెచ్చిపోవద్దని, సంయమనంతోనే భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిద్దామని
పిలుపునిచ్చారు. తెలంగాణా కోసం జేఏసితో కలిసి ఉద్యమిస్తామని, ఈ ఉద్యమాన్ని శాంతియుతంగానే ముందుకు తీసుకుపోతామని ఆయన చెప్పారు. ఉద్యమకారులను రెచ్చగొట్టద్దని ప్రధానిని కేసీఆర్ కోరారు.
పిలుపునిచ్చారు. తెలంగాణా కోసం జేఏసితో కలిసి ఉద్యమిస్తామని, ఈ ఉద్యమాన్ని శాంతియుతంగానే ముందుకు తీసుకుపోతామని ఆయన చెప్పారు. ఉద్యమకారులను రెచ్చగొట్టద్దని ప్రధానిని కేసీఆర్ కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి