గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధి కోసమే నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారే కానీ రైతుల కోసం కాదన్నారు. రైతులను, చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోకుంటే తాము కూడా పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని చిరంజీవి హెచ్చరించారు. రైతులను ఆదుకోవటంలో సర్కార్ విఫలం అయ్యాందన్నారు.మన ఎంపీలు దద్దమ్మలని, వారి చేతగానితనం వల్లే రైతులకు న్యాయం జరగటం లేదని చిరంజీవి ఘాటుగా విమర్శించారు. పంజాబ్ ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ గోదాముల్లో ఎందుకు నిల్వ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సీఎం తన ప్రకటనలో కౌలు రైతుల ప్రస్తావన తేకపోవటం బాధకరమన్నారు.మట్టి పిసికి అన్నం ముద్దను అందిస్తున్న రైతన్నను ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని చిరంజీవి కోరారు. అలాగే చేనేత కార్మికులు,పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి