పరవాడ(విశాల విశాఖ): అధినేతల బాటలోనే ద్వితీయ శ్రేణి నేతలు కూడా ప్రస్తుతం పయనిస్తూ ఒకవైపు వై ఎస్.జగన్మోహన్‌రెడ్డి మరో వైపు జై కాంగ్రెస్ అంటూ జై కొడుతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు... ఎవరు జగన్ వెంట నడుస్తారన్న దానిపై ప్రజలు తెల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి , మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ప్రస్తుతం జగన్ వెంటే నడుస్తున్న విషయం తెలిసిందే ! బాబ్జి మాజీమంత్రి కొణతాల రామకృష్ణకు ప్రధాన శిష్యుడు కావడం, కొణతాల వై ఎస్.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు కావడం దీంతో వారి ఇరువురు జగన్ వెంటే ఉంటరన్నది జగమెరిగిన సత్యం. అయితే పెందుర్తి నియోజకవర్గంలో గల మెజార్టీ కాంగ్రెస్ నేతలు గండిబాబ్జి వెంటే ఉంటారు. దీంతో బాబ్జి నడిచిన బాటలోనే నేతలంతా ప్రయాణించాలని అనుకుంటున్నప్పటికి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లడానికి మరికొందరికి మనసు ఒప్పలేదు. నేటి వరకు జగన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న కొణతాల, గండిబాబ్జితో పాటు ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. జగన్ ఓదార్పు యాత్రలో మాత్రం అందరూ పాల్గొంటామని చెబుతున్నారు. ఇదే బాటలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పయనించి పార్టీకి రాజీనామా చేయకుండా కొణతాల,బాబ్జి వెంట నడుస్తున్నారు. జగన్ కొత్తపార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్లాలా..లేదా అన్న విషయాన్ని కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న క్యాడర్ అంతా బాబ్జి వెంట వెళితే మరో మూడునాలుగేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఆ అధికార ఫలాలను అందిపుచ్చుకోవాలని ద్వితీయ శ్రేణి నేతలలో గల కొంతమంది సీనియర్‌లు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జైబాబ్జి..జై జగన్ అంటున్నా భవిష్యత్‌లో మాత్రం వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్న భావం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని గ్రామాల్లో గల వర్గాలు పట్టి పీడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఒక వర్గం జగన్ వెంట వెళితే మరో వర్గం కాంగ్రెస్‌లో ఉండి అధికారాన్ని చలాయించి వారి సత్తాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. జగన్ వెంట వెళ్లే వర్గం కాంగ్రెస్‌లో ఉండే వర్గంతో ఎలా పోటీ పడాలన్న దానిపై కూడా ఆలోచన చేస్తు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో బాబ్జిపై అభిమానం ఉన్నా ఆయన వెంట జగన్ పార్టీలోకి ఎంత మంది వెళతారన్న దానిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనవరిలో జరిగే ఓదార్పు యాత్రలో మాత్రం ప్రతీ ఒక్కరూ కూడా పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి