ఇటాలియా ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ తమ దేశ మహిళా ఎంపీలకు క్రిస్మస్ బహుమతిని అందజేయనున్నారు. ఆ దేశ పార్లమెంట్‌లో 24 మంది మహిళా ఎంపీలు ఉండగా, 13 మంది సెనెటర్లుతో కలిపి మొత్తం 37 మంది ఎంపీలు ఉన్నారు. వీరందరికీ ప్రధాని క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆమె 1,193 పౌండ్ల విలువ చేసే మొత్తం 37 రింగులను కొనుగోలు చేశారు.వార్షిక క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 74 సంవత్సరాల సిల్వియో ప్రత్యేకంగా వీటిని తయారు చేయించినట్టు టెలీగ్రాఫ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఉత్తర ఇటలీలోని అలెస్సాండ్రియా సమీపంలో ఉన్న వలెంజాలో ఉన్న ప్రముఖ జ్యువెలరీ సంస్థ రెకార్లో వీటిని తయారు చేసింది. మొత్తం 37 మంది మహిళా ఎంపీలకు మూడు రంగులతో కూడిన వజ్రపు ఉంగరాలను ఆమె బహుకరించనున్నారు.దీనిపై రెకార్లో సంస్థ ఛైర్మన్ కార్లో రే స్పందించేందుకు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆ సంస్థ సిబ్బంది మాట్లాడుతూ... ఇటలీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ బహుమతులను ఎంపిక చేశారన్నారు. అయితే, దీనిపై మరింత ఎక్కువగా స్పందించేలేమని, ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారన్నారు.
.
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి