పెద్దపల్లి గ్రామంలో చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. విస్నూరు, దర్తపల్లి గ్రామాలకు చెందిన అన్నా చెల్లెళ్లు పెద్దపల్లి గ్రామానికి ఓ శుభకార్యానికి బుధవారం వచ్చారు. తమ వెంట పిల్లలు మమత(6), అజయ్(6)లను తీసుకు వచ్చారు. గురువారం ఎవరి పనుల్లో వారు ఉండగా ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. వీరింటి పక్కనే ఓ చెరువు ఉంది. పిల్లలిద్దరూ ఆ చెరువు వద్దకు వెళ్లి అందులో మునిగి పోయారు. పిల్లల కోసం వెతుకుతుండగా మధ్యాహ్నం చెరువులో మృతదేహాలు కనిపించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి