ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన ప్రేమ సౌధం "తాజ్ మహల్" మెడలో ఇక నుంచి ధనికులకు మాత్రమే అనే హెచ్చరిక బోర్డు దర్శనమివ్వబోతుందా..? ఇకపై సామాన్యుడు తాజ్‌ను కిలోమీటరు దూరం నుంచి చూడాల్సిందేనా..? అవుననే చెబుతున్నాయి తాజా నివేదికలు. ప్రాచీన సంపదను భావితరాలకు కూడా తెలియాలంటే ఈ చర్యలు తీసుకోకతప్పవని ఆ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.ఈ జాబితాలో కేవలం తాజ్ మహల్ మాత్రమే కాదండోయ్.. ఈజిప్టు పిరమిడ్స్, వెనిస్ నగరం లాంటి చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. మరో 20 ఏళ్లలో ప్రాచీన సంపదగా చెప్పుకునే ఈ ప్రపంచ సంపద కనుమరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కట్టడాలను దర్శించడానికి పర్యాటకుల తాకిడి నానాటికి పెరిగిపోతుండటంతో ఇవి అరిగిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.ఫ్యూచర్ లేబోరేటరీ నిపుణుల ప్రకారం.. సంపన్నులకు సందర్శన వేళలను కుదించడం, సామాన్యులకు పరిసర ప్రాంతాల నుంచి చూసే వీలు కల్పించడం వంటివి చేయడం ద్వారా జాతీయ సంపదను కాపాడుకున్న వాళ్లమవుతామని వారు చెబుతున్నారు. బ్రిటన్‌లో జాతీయ సంపదను సందర్శించాలనుకునే పర్యాటకులు వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వచ్చినట్లు రుజువు చూపితేనే ప్రవేశం ఉంటుందని లేకపోతే ఉండదని డైలీ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.దీనిపై ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్ స్పందిస్తూ.. "ఇలాంటి ప్రాచీన ప్రపంచ సంపదను ఇప్పుడే తిలకించడం మంచిది. భవిష్యత్తులో మనం వెళ్లాలనుకున్నా కష్టమ"ని అన్నారు. "ధనికులు మాత్రమే పెద్దమొత్తంలో ధనం వెచ్చించి టికెట్ కొనుక్కోగలరు. సాధారణ వ్యక్తులు మాత్రం తాజ్ మహల్ లాంటి ప్రదేశాలను సందర్శించాలంటే.. ఏ లాటరీయో గెలిస్తే కానీ టికెట్ కొనలేని పరిస్థిత"ని ఆయన చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి