25, డిసెంబర్ 2010, శనివారం
వైయస్ జగన్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు వస్తారు: గోనె ప్రకాశరావు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య కొద్ది కాలంలోనే 60, 70 దాకా పెరుగుతుందని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు అన్నారు. లక్ష్యదీక్ష సందర్భంగా 25 మంది శాసనసభ్యులు మద్దతు తెలిపారని, ఆ సంఖ్య 60, 70కి పెరుగుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒత్తిడి చేసినా, అధికారంలో లేకున్నా వైయస్ జగన్ వెంట ఇప్పటికే అంత మంది శాసనసభ్యులు వచ్చారని, భవిష్యత్తులో మరింత మంది వస్తారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలలు కూడా అధికారంలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. రోశయ్య కన్నా, భవనం వెంకట్రామ్ కన్నా తక్కువ కాలం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ పై కొంత మంది అవకాలు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి