15, డిసెంబర్ 2010, బుధవారం
చర్లపల్లి జైలులో సుమన్ నిరాహార దీక్ష: గద్దర్ సంఘీభావం
హైదరాబాద్: ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు సుమన్ అన్నాడు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు అక్రమంగా బనాయించిందన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు అన్నింటిని వెంటనే ఎత్తివేయాలన్నారు. ఓ వైపు కేసులు ఎత్తివేస్తామంటూనే ప్రభుత్వం మరోవైపు విద్యార్థులపై కేసులుకొనసాగిస్తుందన్నారు. ఒకే విద్యార్థిపై వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సుమన్ తో పాటు మరో 8 మంది విద్యార్థులు చెర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. వారిని నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.కాగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ గురువారం చర్లపల్లి జైలులో విద్యార్థులను కలిశారు. వారికి తన సంఘీభావం తెలిపారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను సాయంత్రంలోగా విడుదల చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి