వై.ఎస్. జగన్మోహన రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో చేరే అంశంపై కాంగ్రెసు సికింద్రాబాద్ శానససభ్యురాలు జయసుధ దాటవేశారు. జగన్ పార్టీలో చేరేదా వద్దా అనేది పార్టీ పెట్టాక చూద్దామని జయసుధ అన్నారు. వై.ఎస్. జగన్ పార్టీలో చేరడంపై ఇంకా ఆలోచించలేదని జయసుధ తెలిపారు. రైతుల కోసం పోరాడుతున్న వై.ఎస్. జగన్మోహన రెడ్డికి మద్దతిచ్చేందుకే ఇక్కడు వచ్చానని ఆమె వెల్లడించారు.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అవకాశంతోనే ఈ స్థాయికి ఎదిగానని, ఆయన తనయుడు జగన్ రైతులకోసం దీక్ష చేపట్టడంతో తన మద్దతు ప్రకటించానని లక్ష్యదీక్ష ప్రాంగణం నుంచి బయలుదేరిన అనంతరం మీడియాతో అన్నారు.అంతకుముందు వై.ఎస్. జగన్ దీక్షా వేదికపై మాట్లాడిన జయసుధ.. వైయస్ జగన్‌కు బాసటగా ఉండడానికే తాను దీక్ష ప్రాంగణానికి వచ్చినట్లు చెప్పారు. వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రజానాయకుడిగా సుధ అభివర్ణించారు. వై.ఎస్. జగన్ గుండెల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉందని, యువకులకు ఉండాల్సిందీ... ఈ లక్షణాలే అని జయసుధ అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి