14, డిసెంబర్ 2010, మంగళవారం
మాయల మరాఠీగా వైఎస్.జగన్మోహన్: జేసీ.దివాకర్ రెడ్డి
కడప పార్లమెంట్ మాజీ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాయల మరాఠీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. అలాంటి మాయల మరాఠీని అదుపు చేయాలంటే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి బేతాళ మాంత్రికుడుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడాతూ కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఇందుకోసం కేకేఆర్ తన వంతు కృషి, సహసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డి సైతం అప్పుడప్పుడు మధ్యలో నీటిలో చేపలా ఎగురుతున్నారన్నారు. అ వెంటనే నీళ్లలోకి వెళుతుంటారన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి తాను మాట్లాడ దల్చుకోలేదని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి