ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది వరకు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఘలనాయి అనే ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతం తాలిబన్లు, అల్‌ఖైదా తీవ్రవాదులకు బలమైన స్థావరం. ఇక్కడ గిరిజనులు, తాలిబన్ వ్యతిరేక గ్రూపులతో ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటుచేసింది. 100 మంది వరకు అక్కడ ఉన్నారు. ఆత్మాహుతి దాడితో గిరిజన నేతలు, పోలీసుఅధికారులు, ఇద్దరుజర్నలిస్టులు సహా 40 మంది మృతి చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్సనిమిత్తం పెషావర్ ఆసుపత్రికి తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి