ఇద్దరు చిన్నారులు సజీవదహనం
గుంటూరు(విశాల విశాఖ): పొన్నూరులో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. రెండు పూరిళ్లకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి