న్యూఢిల్లీ: డీజిల్ ధరలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని సాధికార మంత్రుల బృందం ఈ నెల 22న సమావేశం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లకు చేరడంతో డీజిల్ ధరను లీటరుకు 1 నుంచి 2 రూపాయల వరకు పెంచే అవకాశాలున్నాయి. కొనుగోలు, అమ్మకం ధరల్లో తేడాల కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు లీటరుకు దాదాపు రూ.4.71 నష్టపోతున్నాయి. డీజిల్ అమ్మకాల ద్వారా రోజుకు చమురు సంస్థల నష్టం రూ. 75 కోట్ల వరకు ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పెట్రోలు ధరల మాదిరిగా డీజిల్ ధరల నిర్ణయాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి