మంచు లక్ష్మీ ప్రసన్న మంచి వక్తగా డిసెంబరు గొడవల్లో పేరు తెచ్చుకుంది. అదే ఆమెకు టీవీ ఛానల్‍లో ప్రముఖులతో లైవ్ షో నిర్వహించే బాధ్యత వచ్చేలే చేసింది. తాజాగా ఆమె నటిగా కూడా అవతారమెత్తింది. ఇంతకుముందే హాలీవుడ్‌లో ఆస్కార్ నటులతో చేసిన అనుభవమూ ఉంది.కానీ తెలుగులో కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన కుమారుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో నటించడానికి లక్ష్మీ ప్రసన్నను అడిగారు. ప్రకాష్ ఆమె విలన్ పాత్రకు సూటవుతుందని పిలిపించారు. కానీ రాఘవేంద్రరావు ఇంటికి వచ్చి మరీ... మోహన్ బాబుతో, మీ కుమార్తెను నటింపజేయవద్దని చెప్పారు." నాన్న కూడా వద్దన్నారు. కానీ అమ్మ ధైర్యం చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోదరులు విష్ణు, మనోజ్‌లు కూడా చాలా ప్రోత్సహించారు" అని లక్ష్మీ ప్రసన్న తెలిపింది. సిద్దార్థ్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రానికి "అనగనగా ఓ ధీరుడు" అనే టైటిల్ పెట్టారు. ఈ వివరాలను తెలియజేసేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న డిస్నీ సంస్థ ప్రతినిధి మహేశ్ కూడా పాల్గొన్నారు. సినిమాను జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు. చందమామలాగా చక్కగా పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తుందనే నమ్మకముందని మహేశ్ అన్నారు. టాలీవుడ్‌లో మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి