కాంగ్రెస్ పార్టీ రెబెల్ యువనేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మరోషాక్ తగిలింది. ఆయన వర్గానికి చెందిన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ (తుడా) మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్య తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ప్రకటించింది. గతంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదని గతంలో పార్టీ ఆయనకు నోటీస్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ నోటీస్‌కు చెవిరెడ్డి సమాధానం ఇవ్వగా, దీనిపై పార్టీ సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై పార్టీపరంగా చర్య తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన ఒక్కక్కరిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులకు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి