* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

27, నవంబర్ 2010, శనివారం

ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు...నలుగురి దుర్మరణం
ఉప్పల్‌: ఉప్పల్‌లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోగా... ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కర్మన్‌ఘాట్‌లోని ఆదర్శ్‌నగర్‌ కాలనీకి చెందిన మూడావత్‌శివ(33) టాటా ప్యాసింజర్‌ ఆటో యజమాని. నాచారం నుంచి సూర్యాపేటకు రోజూ ఓ దినపత్రిక ప్రతులను వాహనంలో తీసుకెళ్తుంటాడు. శనివారం రాత్రి తన సోదరుడి కుమారుడు వీపీ సింగ్‌(11)ను తీసుకుని ఆటోలో ఆదర్శనగర్‌నుంచి నాచారం వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. నాగోలు వంతెన దాటాడు. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోకు ఎదురుగా రాంగ్‌రూట్‌లో రోడ్డు దాటుతున్నాడు. అతణ్ని తప్పించబోయాడు. దీంతో ఆటో అదుపుతప్పింది. పక్కనే ఉన్న డివైడర్‌ పైనుంచి పక్క మార్గంలోకి వచ్చింది. అదే సమయంలో ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు వెళ్తున్న ప్రయివేటు బస్సు ఆటోను వేగంగా ఢీకొంది. దీంతో ఆటోడ్రైవర్‌ శివ, అతడి సోదరుడి కుమారుడు వీపీసింగ్‌, డీఎంఆర్‌పీ టెక్నికల్‌ఆఫీసర్‌ సుక్కల శ్రీనివాసరావు(40) అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉప్పల్‌ పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సైనిక్‌పురికి చెందిన పోతన శాస్త్రీ (53) మృతిచెందాడు. మూడావత్‌ శివ స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా అదేవదారుకుంట తండా. జీవనోపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. భార్యా పిల్లలు, బంధుమిత్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి