శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగను, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి.ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచకములని పండితములు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి.అలాగే పుట్టుమచ్చల మీట వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అని కొంచెము పొడవు కలిగివున్నచో ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని పురోహితులు చెబుతున్నారు. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెము పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి.ఇకపోతే.. పురుషులకు రెండు కనుబొమల మధ్య యున్నచో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి