* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, నవంబర్ 2010, గురువారం

స్విస్ బ్యాంకు నల్లధన జాబితాలో భారతీయులే టాప్..!!

 భారతదేశంలో అవినీతికి కొరతే లేదు అనడానికి ఈ తాజా సంఘటనే నిలువెత్తు నిదర్శన. తమ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం గురించి నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది స్విస్ బ్యాంక్. స్విస్ బ్యాంక్ అసోషియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ "యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్" (యూబిఎస్)లో ఉన్న నల్లధన డిపాజిటర్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారన్న నిర్ఘాంతపోయే నిజాన్ని నిదానంగా ప్రకటించింది.భారతీయులు 65 వేల 223 వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలు కూడా ఈ జాబితాలో ముందున్నాయి. నల్లధన జాబితాలో రష్యా ద్వితీయ స్థానంలో ఉండగా.. చైనా ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. స్విస్ బ్యాంకులో దాగి ఉన్న నల్లధన వివరాలు రాబట్టేందుకు ఓవైపు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు కూడా స్విస్ బ్యాంకులో దాచిన నల్లధన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా.. నల్లధనం గురించి ఖచ్చితమైన నగదు వివరాలను స్విస్ బ్యాంక్ అసోసియేషన్ వెల్లడించడం కూడా ఇదే తొలిసారి. ఈ నల్లధనాన్ని భారతదేశ అభివృద్ధిపై వెచ్చిస్తే మనం కూడా అగ్రదేశాల సరసన నిలుస్తామనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భారతదేశంలో అవినీతికి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి