విక్టరీ వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ప్రిస్టీజియస్ మూవీ నాగవల్లి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 16న విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఇటీవల విడుదలైన ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఈ వారంలోనే థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఆడియో హిట్ కావడంతో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారఅంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా వెంకటేష్ పెర్‌ఫార్మెన్స్ ఉంటుంది. పి.వాసుగారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వెంకటేష్, 60మంది డాన్సర్లపై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో అభిమానులు లేనిదే హీరోలు లేరురా.. అనుచరులు లేనిదే లీడరు లేరురా అనే పాటను బాదామిలో చిత్రీకరిస్తున్నాం. దీంతో చిత్రం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాగవల్లి మా బ్యానర్లో ఓ మెమరబుల్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి