కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీమలో ఆయనపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రాన్ని సవ్యదిశలో నడిపించగల సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉందని గంటకొట్టి చెపుతున్నాయి.ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే చూశారుగా.... మావోడే సీఎం... పరిస్థితిని చక్కదిద్దాలంటే సీమ సింహాలకే చెల్లుతుందంటూ మీసాలు మెలేస్తున్నారు. ఇలా ఎవరెన్ని చెప్పుకుంటున్నా కొత్త ముఖ్యమంత్రి మాత్రం తనదైన శైలిలో సమాధానాలు చెప్పేస్తున్నారు.తన తల్లిదండ్రులది రాయలసీమ ప్రాంతమైనా తను పుట్టి పెరిగింది హైదరాబాదులోనేననీ, తనకు కోస్తాంధ్రలో ఎంతోమంది స్నేహితులున్నారని అంటున్నారు. మొత్తంగా అందరూ తనవాళ్లే అని చెపుతున్నారు కేకేఆర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి