హైదరాబాద్: పోలవరంపై వివాదం చెలరేగుతున్న స్థితిలో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఉద్యమం చేసేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. పోలవరాన్ని అడ్డుకుంటున్నది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారేనని ఆయన ఆరోపించారు. పోలవరాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.పోలవరం జాతీయ హోదాపై ప్రజారాజ్యం పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమయిందని కోటగిరి చెప్పారు. ఇప్పటికే ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖ రాశారన్నారు. ఈనెల 23న చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు మరోసారి ప్రధానమంత్రిని కలిసి పోలవరం జాతీయ హోదాకు ఒత్తిడి తీసుకు వస్తారని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి