మంత్రివర్గంలో ప్రరాపా చేరుతుందా?
హైదరాబాద్ : తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటి స్థితే కొనసాగుతుందా? రెండు పార్టీలూ మరింత సన్నిహితమవుతాయా? మంత్రివర్గంలో ప్రరాపా చేరుతుందా? ఇప్పుడు కాకుంటే విస్తరణ సమయంలో చేరే అవకాశముందా? అన్న వాటిపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి.కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే... కడప ఎంపీ జగన్ వర్గం వ్యవహారశైలి ఎలా ఉండబోతోందన్న అంశం ఆధారంగానే ప్రరాపాని మంత్రివర్గంలోకి ఆహ్వానించటమా లేదా అనేది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య నెలకొన్న మద్దతు రాజకీయం ఆ తరువాత కొంతవరకు ముందుకు సాగింది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు తొలుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేసేందుకు రెండుపార్టీల నుంచీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఒక దశలో పొత్తు కుదిరినట్లేనని భావించినా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో అది ఆచరణలోకి రాలేదు. తరువాత ప్రరాపా ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం బలంగా వినిపించింది. తనవర్గం ఎమ్మెల్యేలతో జగన్ పార్టీని వీడినా, సహాయ నిరాకరణ చేసినా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రరాపా ఎమ్మెల్యేల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటుందని భావించారు. ఈ పరిణామం చోటుచేసుకోకపోయినా... రోశయ్య హయాంలో పార్టీకి సముచిత ప్రాధాన్యమే లభించింది. ప్రరాపా విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకునే వారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా వీరి నియోజకవర్గాల పనులు చూడమనే సందేశం కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిందని సమాచారం. పాలనపై ప్రరాపా నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించినా... అవి పార్టీల మధ్య సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇంతలో ఊహించని రీతిలో రోశయ్య రాజీనామా చేయటం, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ స్థానంలోకి వచ్చారు. దీంతో రెండు పార్టీల సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పుడూ జగన్ అంశమే రెండు పార్టీల మధ్య సంబంధాలకు కీలకమైంది.మంత్రివర్గంలో చేరితే పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవచ్చనే భావన కొంతమంది ప్రరాపా నాయకులు, ఎమ్మెల్యేల్లో ఉంది. తాజాగా మంత్రివర్గం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానం అందితే అప్పుడు ఆలోచిస్తామని అధికారికంగా ప్రరాపా స్పందించింది. ప్రభుత్వంలో చేరమని ఆహ్వానం అందినా... చేరటానికి ఇది సరైన సమయం కాదేమోనన్న సందేహం అంతర్గతంగా కొంతమంది సీనియర్ నేతల్లో ఉంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం జనవరి, ఫిబ్రవరిల్లో తిరిగి ఆందోళనలు చోటుచేసుకునే అవకాశముంది. ఇప్పుడు ప్రభుత్వంలో చేరితే ఉద్యమాల ప్రభావం తమపైనా పడుతుందని భావిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పర్యవసానాలన్నీ జరిగేంత వరకు వేచి చూడాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అప్పటివరకు అవసరమైన సమయాల్లో సహకారం ఇవ్వటానికే పరిమితం అయితే మేలన్నది వీరి వాదనగా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కోరితే మంత్రివర్గంలో చేరటమే మేలనే భావనా కొందరిలో ఉంది. మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలుండాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని సూచనలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ప్రరాపాని మంత్రివర్గంలో చేరమని ఆహ్వానించేలా ఉంటాయా, లేదా అన్నది ఆదివారంనాటికి స్పష్టత వచ్చే వీలుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి