* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

23, నవంబర్ 2010, మంగళవారం

రాజుగారి అక్రమాలు మాటేంటి

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలచేత... ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నిత్యం నిధులను వెనకేసుకోవడంలోనే బిజీ అయిపోతున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం మన దేశంలోని నాయకుల చరిత్రను తవ్వి చూస్తే బయల్పడుతున్న విషయాలు ఇవే."ఏ నాయకుడిని చూసినా ఏమున్నది... అవినీతి అక్రమాల చుట్టూ వారి రాజకీయ జీవితం" అన్నట్లుగా ఉంది నేటి రాజకీయ నాయకుల పరిస్థితి. అమాత్య కిరీటం అక్రమార్జనకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. దీపావళి సంబరాల్లో భారత్‌లో అడుగుపెట్టిన బరాక్ ఒబామా భారత్ అభివృద్ధిని చూసి ఓహో.. ఆహా అంటూ పొగిడి వెళ్లారు.ఆయన పొగడ్త వెనుక ఉన్న అసలు రహస్యం సంగతి అలా ఉంచితే... మన దేశంలో నాయకులు, నాయకుల అండతో దేశాన్ని దోచుకు తింటున్న లక్షల కోట్ల ధనం... నిజంగా ప్రజలకోసం వినియోగమైతే భారతదేశం సూపర్ సోనిక్ కంట్రీగా ఇప్పటికే అవతరించి ఉండేది. అయితే ఇంతమంది పందికొక్కులు ఎడాపెడా డబ్బును తినేస్తున్నప్పటికీ వాటన్నిటినీ తట్టుకుని భారతదేశం ఆమాత్రమైనా ముందుకు వెళుతున్నదంటే సగటు భారతీయుల్లో కాస్తో కూస్తో నీతి, నిజాయితి ఇంకా బతికే ఉందని అనుకోవచ్చు.
అవినీతి, అక్రమాల ఊబిలో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న భారత్ పగ్గాలలో ఒక్కో పగ్గా( శాఖ)న్ని ఒక్కో మంత్రి తన చేతిలోకి తీసుకుని సమర్థవంతంగా నడపాలి. కానీ ఏం జరుగుతోంది. చేతిలోకి పదవి వచ్చీరాగానే నిధుల వేటలో మునిగిపోతున్నారు మంత్రులు, నాయకులు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి అల్లుడు, టెలికం మాజీమంత్రి రాజా నిర్వాకం దీన్నే ఎత్తి చూపిస్తోంది.కమ్యూనికేషన్ల శాఖను నిర్వహించిన రాజా, దర్జాగా.. అడ్డగోలుగా కేటాయింపులు చేసి ప్రభుత్వానికి దక్కవలసిన రూ.1.76 లక్షల కోట్ల రూపాయలకు గండికొట్టారు. ఆ నిధులు దారులు వెతుక్కుంటూ పక్కదారులకు వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.అడ్డగోలుగా కేటాయింపులు చేస్తూ టెలికం మంత్రి ఎ.రాజా అక్రమాలకు ద్వారాలు తెరిచారు. ఫలితంగానే ప్రభుత్వానికి ఇంతటి భారీ నష్టం.టెలికమ్యూనికేషన్ల పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎదుట ఉన్నది. కాగ్ సమర్పించిన నివేదికను మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో అగ్రశ్రేణి కార్పొరేట్ కంపెనీలు వాటాలను ఎలా కొల్లగొట్టిందీ, 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను దక్కించుకునేందుకు అవలంభించిన అక్రమ మార్గాలన్నిటినీ కాగ్ తన నివేదికలో ఏకరవు పెట్టింది.కేటాయింపులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను రాజా తుంగలో తొక్కినట్లు స్పష్టంగా కనబడుతోంది. నిబంధనలను అతిక్రమిస్తూ కేటాయింపులు దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్, యూనిటెక్, లూప్, డేటాకమ్ ఎలియాంజ్ ఇన్‌ఫ్రా వంటివి ఉన్నట్లు కాగ్ ఎత్తి చూపింది. మొత్తం 120 కంపెనీల్లో సుమారు 85 కంపెనీలకు సంబంధించిన లైసెన్సులన్నీ సక్రమమైనవి కావని కాగ్ తెలిపింది.ఇటువంటి కంపెనీలకు కేటాయింపులను చేస్తూ అప్పటి టెలికం మంత్రి రాజా, జనవరి 10, 2008లో పత్రికా ప్రకటన జారీ చేశారని పేర్కొంది. చిత్రంగా ప్రకటన వెలువడ్డ 45 నిమిషాల్లోపే వ్యవహారం అంతా చకచకా జరిగిపోయిందని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే మంత్రి తీసుకోబోయే నిర్ణయాలు, కేటాయింపుల గురించిన సమాచారం ముందుగానే ఆయా కంపెనీలకు చేరిపోయిందని తెలుస్తోంది.పైగా పత్రికా ప్రకటన వెలువడక ముందే కొన్ని కంపెనీలు డీడీలు తీసుకుని సిద్ధంగా ఉంచుకోవడాన్ని చూస్తే పరిస్థితి తేటతెల్లమవుతుంది. ఇలా అడగుడుగునా రాజా అక్రమాలకు తలుపులు బార్లా తెరిచారని కాగ్ నివేదిక ఎండగట్టింది. ఇదీ టెలికం మాజీమంత్రి వ్యవహారం.ఇక కామన్వెల్త్ క్రీడలకుగాను నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్‌లో అక్రమాల వ్యవహారంలో కల్మాడీ, కార్గిల్ అమరవీరులకోసం నిర్మించిన ఆదర్స్ భవనం ప్లాట్ల కేటాయింపుల్లో "మహా" మాజీముఖ్యమంత్రి అశోక్ చవాన్ పాత్ర.... ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం ప్రపంచపుటవినీతి జాబితాలో అత్యంత వేగంగా అగ్రస్థానాన్ని ఆక్రమించేటట్లు కనబడుతోంది. ఈ జాఢ్యాన్ని కూకటి వేళ్లతో పెకళించగల నిస్వార్థ నేతలు భవిష్య భారతంలో చూడగలమా..? ఏమో..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి