2జీ స్పెక్టృం కుంభకోణంపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో బుధవారం నాటికి వాయిదా పడ్డాయి. మంగళవారం పార్లమెంట్ సభ ప్రారంభమైయిన వెంటనే 2జీ స్పెక్టృంపై జేపీసీ విచారణకు విపక్షాలు పట్టుబట్టాయి. సభను సజావుగా నడవడానికి సహకరించాలని స్పీకర్ ఎంత సర్దిచెప్పిన విపక్ష సభ్యులు వినకపోవడంతో సభా కార్యక్రమాలకు ఆటకం ఏర్పడటంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. జేపీసీకి పట్టుపడుతూ సభ్యులు పొడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోయేసరికి సభను బుధవారం నాటికివాయిదా వేశారు. రాజ్యసభలోకూడా ఇదే పరిస్థితి నెలకొనగా సభను రేపటికి వాయిదా వేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి