హైదరాబాద్: ఫ్రీజోన్ అంశం, ఎస్‌ఐ నియామక పరీక్షలపై పీసీసీ అధ్యక్షుడు డీఎస్ తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓయు జేఏసీ విద్యార్థులు ఆయన ఇంటిముందు నిరసన చేపట్టారు. అన్ని రాజకీయపార్టీలు ఈ వివాదంపై మాట్లాడుతుంటే డీఎస్ ఎందుకు స్పందించటంలేదని వారు ప్రశ్నించారు. దీనిపై ఆయన తన వైఖరి స్పష్టం చేయకపోతే ఆయన ఇంటిని దిగ్భందం చేస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో డీఎస్ ఇంట్లో లేకపోవటంతో విద్యార్థులు కొంతసేపు బైఠాయించి వెళ్లిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి