ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య పూర్తికాలం కొనసాగుతారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. హస్తినకు చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ చేరుతుందని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇవి కేవలం మీడియా ఊహాజనిత కథనాలేనన్నారు.ఇకపోతే.. ముఖ్యమంత్రి రోశయ్య తన పదవిలో ఐదేళ్ళపాటు కొనసాగుతుందన్నారు. ఆయనకు ఉన్న అపార అనుభవంతో మిగిలిన కాలాన్ని నెట్టుకొస్తారన్నారు. పోలవరంతో పాటు.. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశంపైనే ప్రధాని మన్మోహన్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశమయ్యే అవకాశాలు లేవన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి