హైదరాబాద్: ఎస్‌ఐల నియామకంపై ఎలాంటి అనుమానాలు, అయోమయం అవసరంలేదని రాష్ట్ర పోలీసు నియామక సంస్థ ఛైర్మన్ మాలకొండయ్య పేర్కొన్నారు. జోనల్ వివాదంపై స్పష్టత వచ్చేవరకు హైదరాబాద్‌లో నియామకాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. 2008 డిసెంబర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఆరవ జోన్‌లో ప్రకటించిన 402 సివిల్, 45 ఏఆర్ ఎస్‌ఐలను, రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ యూనిట్లలో నియమిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోనా, ఆరవజోనా అనే విషయం ప్రభుత్వం తేల్చాకే సిటీలో ఎస్‌ఐల నియామకంకోసం మరో నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1297 ఎస్‌ఐ పోస్టులకు 18వేల 300మంది రాతపరీక్షలకు ఎంపికయ్యారని ఇందులో ఆరవజోన్‌లో 4,900 మంది ఉన్నారని మాలకొండయ్య చెప్పారు. ఇందులో ఆరవ జోన్‌లో 4,900మంది ఉన్నారని చెప్పారు. కానిస్టేబుళ్ల రాతపరీక్ష ఫలితాలుకూడా హైదరాబాద్ మినహాయించి మిగిలినవి ప్రకటిస్తామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి