సాధారణంగా ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి 'కార్తీకమాసమ'ని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉందిఅలాగే కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో మాత్రమే గాకుండా, మంగళవారాల్లో పెళ్లికాని అమ్మాయిలు, వివాహితులైన మహిళలు గౌరీదేవిని నిష్టతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులుఅంటున్నారు. కార్తీకమాసంలోవచ్చేసోమవారం శివునికెంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించేవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతీరోజూ ఆదిదంపతులను ప్రార్థించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయి. అందుచేత కార్తీక సోమ, మంగళవారాల్లో వివాహిత, అవివాహితులు శివాలయాలకు చేరుకుని, నేతితో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇలాచేస్తే.. వివాహం, సుఖసంతోషాలు, సకలసంపదలు, వాహనయోగం వంటివి చేకూరుతాయికార్తీక సోమవారాల్లో నదీ స్నానాలు చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే.. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్చీకమాసంలో వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీస్నానం చేయడం చాలా మంచిది. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైన ఉంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడై శివుడిని ధ్యానించాలి. అలాగే ఈ నెలరోజుల పాటు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేస్తే మహత్తరశక్తి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి