* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

24, నవంబర్ 2010, బుధవారం

బీహార్‌లో రేపు కొలువుదీరనున్న నితీశ్‌ ప్రభుత్వం

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్‌కుమారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తుందని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఎన్డీయే శాసనసభా పక్షం గురువారం భేటీయై సభా నాయకుణ్ని ఎన్నుకుంటుంది. అంతకుముందే జనతాదళ్‌(యు), భాజపా శాసనసభ సభ్యులు విడివిడిగా భేటీయై తమ తమ పక్షాల నాయకులను ఎన్నుకుంటారు. ఈ భేటీలకు భాజపా తరఫున కేంద్ర పరిశీలకులుగా అరుణ్‌జైట్లీ, అనంతకుమార్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లు హాజరవుతారు. భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోడీనే మళ్లీ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జేడీయూ-భాజపా కూటమి 206 చోట్ల విజయం సాధించగా, ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి 25, కాంగ్రెస్‌ 4, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి