గిరిజన ఐక్యవేదిక
హైదరాబాద్ (విశాల విశాఖ ప్రతినిది): కొమరంభీమ్ విగ్రహం సిద్ధంగా ఉన్నా ప్రతిష్టించడంలో ప్రభుత్వం తాత్సారం చూపుతోందని గిరిజన ఐక్యవేదిక ఆరోపించింది. ఈ అంశంపై సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.చెల్లప్పను కలిస్తే విగ్రహ ప్రతిష్టకు మరో ఆరునెలలు పడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపినట్లు చెప్పారని వేదిక కన్వీనర్ వివేక్ వినాయక్ అన్నారు. ఈ సమాధానం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మరో పదిహేను రోజుల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. విగ్రహాన్ని తామే ప్రతిష్టించుకొంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఆదివాసీ మేధావులు, ప్రజాప్రతినిధుల సదస్సులో వివేక్ వినాయక్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాలలో వందలాది మంది విషజ్వరాలు, ఇతర రోగాలతో మరణిస్తున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయితీరాజ్ ఎన్నికల్లో తమ ప్రాంతంలో కూడా గిరిజనేతరులకు అవకాశాన్ని కల్పించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజారాంలక్య, చందా లింగయ్య దొర, సీడం అర్జులతో పాటు ఆదివాసీ సంఘం నేతలు, రాజకీయ నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తీర్మానం రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వివేక్ వినాయక్ తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి