* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

26, ఆగస్టు 2011, శుక్రవారం

విశాఖలో 18న బహిరంగ సభ

హైదరాబాద్‌(విశాల విశాఖ) : విశాఖపట్నంలో వచ్చే నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. . కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నాయకులే ఈ బాధ్యతను తీసుకున్నారు. ప్రరాపా శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చూసేందుకు దీనిని తలపెట్టారు. విశాఖపట్నం సమీప నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభకు చిరంజీవితోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు వారాలకు గుంటూరులో అదే స్థాయిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం దీనిని ఉద్దేశిస్తున్నారు. ఆపై రాయలసీమ జిల్లాల కోసం అనంతపురం లేదా కర్నూలుల్లో మరో సభ జరుపుతారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సీనియర్‌ నేతలు గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు, వేదవ్యాస్‌, సుబ్బరాయుడు, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. పార్టీ పదవుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో నియమించాల్సిన నాయకులు, సీనియర్‌ కార్యకర్తల జాబితాను ఇవ్వాలని బొత్స వీరిని కోరారు. వారంరోజుల్లో పీసీసీ, డీసీసీల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నానని వాటిలో ప్రరాపాలో పనిచేసిన వారిని వారి స్థాయినిబట్టి సర్దుబాటు చేస్తానని బొత్స వారికి వివరించారు. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాల్సిన వారి జాబితాను ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి