* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

27, ఆగస్టు 2011, శనివారం

ప్రయోగ ప్రాతిపదికన రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు

న్యూఢిల్లీ: ప్రయోగ ప్రాతిపదికన రూ.10 విలువ కలిగిన వంద కోట్ల పాలీమర్‌ బ్యాంక్‌ నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ఐదు చోట్ల వీటిని విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ మీనా శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాల ఆధారంగా వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.వంద కోట్ల ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు 2009లో గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. దొంగనోట్లను అరికట్టడానికి ఈ తరహా పాలీమర్‌ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ఆ తరువాత న్యూజీలాండ్‌, పపువా న్యూ గినియా, రొమేనియా, బెర్ముడా, బ్రునై, వియత్నాం వీటిని ప్రవేశపెట్టాయి.మరోప్రశ్నకు సమాధానమిస్తూ.. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి చెందిన కొందరు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు నమోనారాయణ మీనా చెప్పారు. వీరిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిందని తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి