* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

29, ఆగస్టు 2011, సోమవారం

జి.సి.సి. ఉత్పత్తులు అన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీకై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

విశాఖపట్నం, ఆగస్టు 29 ; జి.సి.సి. ఉత్పత్తులను అన్ని సంక్షేమ వసతి గృహాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. తదననుగుణంగా నాణ్యమైన వస్తువులను అన్ని వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు జి.సి.సి. అధికారులు సన్నదం కావాలని మంత్రి ఆదేశించారు. పంపిణీలో ఎటు వంటి అంతరాయం లేకుండా ప్రణాళికా బద్దంగా సరుకులను ముందుగానే నిల్వ ఉంచుకోవాలన్నారు. సోమవారం జి.సి.సి.కార్యాలయ సమావేశ మందిరంలో జి.సి.సి. మేనేజింగ్‌ డైరెక్టర్‌, జనరల్‌ మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.సి.సి. అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జి.సి.సి. ఉత్పత్తులను ఇప్పటి వరకూ గిరిజన సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. జి.సి.సి. ఉత్పత్తులకు మంచి ఆధరణ కల్పించాలనే లక్ష్యంతో అన్ని ఎస్‌.సి., బి.సి., మైనారిటీ, వికలాంగ సంక్షేమ వసతి గృహాలకు కూడా జి.సి.సి. ఉత్పత్తునే పంపిణీ చేయాలని నిర్థేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ముదావహం అన్నారు. ఈ అవకాశాన్ని జి.సి.సి. అధికారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాలకు నాణ్యమైన ఉత్తత్తులను పంపిణీ చేయడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గిరిజన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసేందుకు అవసరమైన యూనిట్లను పలు ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్రినాథరావును మంత్రి ఆదేశించారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 20 కోట్ల అంచనా వ్యయంతో పలుచోట్ల నూతనంగా డి.ఆర్‌.డిపోలు, గోడాములు నిర్మించేందుకు, ప్రస్తుతం ఉన్న వాటికి మరామత్తులు చేసేందుకు పలు పనులు చేపట్టబడినవని, వాటన్నింటినీ రానున్న ఆరు మాసాల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు నిర్ణీత సమయంతో పూర్తిచేయాలని, లేకుంటే ఆయా నిర్మాణ పనులను ఇతర శాఖ ఇంజనీరింగ్‌ విభాగాలకు అప్పగిస్తామన్నారు. ప్రతిపాదించి ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తే, అన్ని డి.ఆర్‌.డిపోలకు సొంత భవనాలు ఏర్పాటు చేయగలవారమవుతామన్నారు. డి.ఆర్‌. డిపోల ద్వారా గిరిజనులకు గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని క్రమబద్దీకరించాలని, అందరికీ సకాలంలో సిలిండర్లు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖలో నిర్మాణంలోనున్న కోల్డు స్టోరేజీ పనులను వేగవంతం చేసి మూడు, నాలుగు మాసాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. వర్తకులకు ఎటు వంటి మినహాయింపులు ఇవ్వాల్సిన పని లేదని, వారు కొనుగోలు చేసుకున్న ఉత్పత్తులను నెలల తరబడి గోడాములలో ఉంచవద్దని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది కాలంలో జి.సి.సి. సాదించిన లక్ష్యాలను పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్రినాధరావు మంత్రికి వివరించారు. జనరల్‌ మేనేజర్లు అప్పారావు, మనోహర్‌, చంద్రశేఖర్‌, విశాఖపట్నం, వరంగల్‌, ఆదిలాబాద్‌ సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, అన్ని డివిజన్లకు చెందిని డివిజనల్‌ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి