జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టిన సామాజికవేత్త అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సాగుతున్న ఈ దీక్షకు మద్దతుగా భారీ సంఖ్యలో జనం మైదానంకు చేరుతున్నారు. మరోవైపు హజారేతో సామాజికవేత్తల బృందం సమావేశం అయింది. ఈ సమావేశంలో కిరణ్‌బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్, మనీశ్ సిసోడియా, మేధాపాట్కర్ తదితరులు ఉన్నారుఇదిలావుండగా, దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ర్యాలీ సంజీవయ్య పార్కుకు చేరుకుని తిరిగి పీపుల్స్ ప్లాజాకు నిర్వహించారు. ఈ ర్యాలీలో చిన్నారులు, యవతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నాకు మద్దతుగా, అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటులో జనలోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
అలాగే, అన్నా హజారేకు మద్దతుగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిరహిత భారత్ ఏర్పడినపుడే భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి