హైదరాబాద్ (విశాల విశాఖ): కడప ఎంపీ జగన్ సానుభూతి కోసం టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ద్వారా పెద్దవాడై ఇప్పుడు పార్టీనే విమర్శిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వానికి ఓ చట్టం ఉంటుందని దాన్ని ఉల్లఘించి అడ్డగోలుగా దోచుకున్నవారు ఇప్పుడు అనుభవిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు. గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో జరిగిన కృష్ణాజిల్లా కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి