విశాఖపట్నం: రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా చేపట్టింది. ఎన్నికలకు ముందు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను పూర్తిగా విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జె.వి.ఎస్.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హుల పేరుతో జిల్లాలో అనేకమంది రేషన్‌కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగ ఫించన్లు రద్దు చేయడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి