సెప్టెంబరు నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. యూపీఏ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం వస్తుందన్నారు.అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలని కోర్‌కమిటీ చేసిన సూచనలకు సర్వత్రా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల హక్కుల పరిరక్షణ, నదీజలాల వినియోగంపై అనుమానాలు, భయాందోళనలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలకమైన హైదరాబాద్‌తో పాటు నదీజలాల వాటాలే అత్యంత కీలకంగా మారాయన్నారు. ఈ రెండు అంశాల కారణంగానే రాష్ట్ర విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి