12, నవంబర్ 2010, శుక్రవారం
నేడు నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి జిల్లాలోని కనగల్‌కు చేరుకుంటారు. అక్కడ రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన 132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 11 గంటల సమయంలో హుజూర్‌నగర్ వెళ్తారు. అక్కడ వంద పడకల ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం మిర్యాలగూడ వెళ్లి మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి