హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెల 20న నిర్వహించతలపెట్టిన డిప్లొమా పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యా శిక్షణ మండలి తెలిపింది. మిగిలిన తేదీల్లో పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.
జేఎన్‌టీయూహెచ్ బీటెక్, బీఫార్మసీ పరీక్షలు రద్దు:జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉన్న బీటెక్, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు 20వ తేదీ జరగాల్సిన మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ తులసీరాందాస్ తెలిపారు. ఎస్సై రాత పరీక్షల విషయంలో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో రద్దయిన ఈ పరీక్షలను ఆదివారం (21న) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి