18, నవంబర్ 2010, గురువారం
16 ప్రాజెక్టుల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం చేపట్టిన 16 నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) గుర్తించింది. ఇందులో 6 పనులను ప్రజాపనుల శాఖ(పీడబ్ల్యూడీ), మూడింటిని ఢిల్లీ పురపాలకశాఖ, మిగతా పనులను వివిధ సంస్థలు పూర్తిచేశాయి. కామన్వెల్త్ క్రీడల కోసం చేపట్టిన నిర్మాణ ప్రాజెక్టులపై సీవీసీ అంతర్గత దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. సరాయ్‌కానేఖాన్ ప్రాంతం నుంచి జవహర్‌లాల్ స్టేడియం వరకు రూ.400 కోట్లతో నిర్మించిన రహదారి పనులను అర్హత లేని కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు సీవీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలని పీడబ్ల్యూడీని ఆదేశించింది. చాలా ప్రాజెక్టుల్లో నాణ్యతలేని నిర్మాణ సామగ్రి వాడడం, రేట్లను పెంచి చూపడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని, వీటిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించాయని వెల్లడించింది.రైన్ టి-పాయింట్ వద్ద ఫ్త్లెఓవర్ నిర్మాణ పనులను 'నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ' చేపట్టింది. అంచనా వ్యయం రూ.65.76 కోట్లు కాగా అధికారులు ఆ సంస్థకు రూ.97.91 కోట్లకు పనులు అప్పగించారు. నిబంధనల ప్రకారం.. పనుల పర్యవేక్షణ కోసం థర్డ్‌పార్టీ సంస్థను నియమించుకొన్న తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. నవయుగ కంపెనీ మాత్రం పనులు మొదలైన 7 నెలల తర్వాత థర్డ్‌పార్టీని ఏర్పాటు చేసుకుందని సీవీసీ తన నివేదికలో పేర్కొంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి