తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని షాపింగ్‌మాల్స్‌లలో చెన్నయ్ సిటీ సెంటర్ ఒకటి. ఈ షాపింగ్ మాల్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు షాపింగ్‌తో పాటు మనస్సుకు ఆహ్లాదం కలిగించే సకల సౌకర్యాలు ఈ మాల్‌లో ఉండటం ప్రత్యేకత. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే షాపింగ్‌తో పాటు.. ఐమాక్స్ సినిమా థియేటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌లలో నగర వాసులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మోంబాసా కార్నివాల్ -10ను నిర్వహిస్తోంది. కెన్యా దేశంలోని మోంబాసా అనే ప్రాంతానికి చెందిన నలుగురు ఆఫ్రికా ఆర్కోబాట్స్ (సాహస క్రీడాకారులు) వళ్లుగగుర్పొడిచే విధంగా సాహసకృత్యాలను చేస్తూ ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక షో (ఒక తరహా సర్కస్) వచ్చే వారం రోజుల పాటు సాగుతుంది.బాసా అనే ప్రాంతంలోని ఆటపాటలతో పాటు వారి సంస్కృతీ సంప్రదాయలను కళ్ళకు కట్టినట్టు ఇందులో చూపించనున్నారు. చెన్నయ్ నగరంలోని షాపింగ్ మాల్స్‌లలో ఈ తరహా ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో బాడీ అక్రోబాటిక్స్, లింబో, వెర్టికల్ పో వంటి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రోజుకు మూడు ఆటను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన జరిగే ప్రాంతాన్ని హ్యాడిక్రాఫ్ట్స్, థికింగ్ మ్యాన్, గెయింట్ మాస్క్‌లతో అందంగా అలంకరించారు.తేకాకుండా, చెన్నయ్ సిటీ సెంటర్‌లో ప్రతి రూ.500లకు షాపింగ్ చేసే నగర వాసులు ఒక కూపన్ అందజేస్తారు. ఈ కూపన్ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వారికి లక్కీ బంపర్ బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటు.. మొదటి బహుమతిగా యమహా ఎఫ్‌జడ్, రెండో బహుమతిగా స్కూటీ పెప్, మూడో ప్రైజ్‌గా హోమ్ థియేటర్ బహుమతిని అందజేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి