* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, నవంబర్ 2010, గురువారం

"నాగవల్లి"కి ఇంకా 7 సీక్వెల్స్ వస్తాయి: పి.వాసు

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు, నాగవల్లి పాటలు సుపర్బ్‌గా వచ్చాయన్నారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లున్నారనీ, వారిలో చంద్రముఖి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు.అనంతరం దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ... ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. ఈ చిత్రంలో అన్ని రసాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇంతకు ముందు చంద్రముఖిగా జ్యోతిక నటించిందనీ, ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరోయిన్ కనిపించబోతుందన్నారు.వీరిలో ఎవరు బాగా నటించారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందనీ, దాని ప్రకారమే వాళ్లను చూపించామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ... నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయని చెప్పారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొత్త వెంకీని చూస్తారని చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు, బ్రహ్మానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి